Grabline.com - News from India, USA and World. Deals and comparison shopping to save you money.
Sat, 05 Jul 2008 11:05 am PDT
 

News and Deals - Grab it all here

Some go everywhere, some grab it all here

 News | Hindi | Shopping | Deals | Find Lowest Price Save! | Credit Cards Compare!

"Even Castles made of sand, fall into the sea, eventually." - Jimi Hendrix
 
Spread Grabline.com
 
 OneIndia - Telegu 
Sat, 05 Jul 2008 16:03:34 GMT
•  పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం: జానారెడ్డి 
హైదరాబాద్: విశాఖ జిల్లా లోని బలిమెల రిజర్వాయర్లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని హోం మినిస్టర్ జానారెడ్డి అన్నారు. విశాఖలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ డిప్ట్యూటీ ఎసాల్ట్ కమాండర్ దుర్గా ప్రసాద్ కు నివాళులు అర్పించేందుకు  హోం మినిస్టర్ జానారెడ్డి  ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల త్యాగాలను హోం మంత్రి కొనియాడారు. దుర్గా ప్రసాద్ అంత్యక్రియలు ...
 
•  'బికినీ' నా... నో! 
రోజురోజుకీ బికినీల క్రేజ్ బాలీవుడ్ లోనే కాక,టాలీవుడ్,కోలీవుడ్ లలో పెర్గిపోతోంది. వారు చూపెడుతున్నారని ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారో...లేక ప్రేక్షకులు చూస్తున్నారని భామలంతా బికినీలు కట్టటానికి రెడీ అవుతున్నారో తెలియని పరిస్ధితి నెలకొంది. 
 
•  బి.సి సెంటర్లలో 'పాండురంగడు' హవా... 
శ్రీకృష్ణునిగా, పుండరీకునిగా బాలకృష్ణ ద్విపాత్రలు పోషించిన 'పాండురంగడు' సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చింది. అయితే 'ఎ' సెంటర్లలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతంత మాత్రంగా వున్నాయి. కానీ బి, సి సెంటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా  ఆదరిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.  ఇక ఈ సినిమా ఉత్తరాంధ్రలో  22 కేంద్రాలకు గాను 4 వారాల్లో 1 కోటీ 32 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది.
 
•  మెగాస్టార్...ఇక గ్రాండ్ ఫాదర్ 
హైదరాబాద్: చిరంజీవి నేత కాక ముందే తాత అయ్యారు. గత యేడాది తన కుటుంబాన్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని కోర్టుకు సైతం వెళ్ళి సంచలనం సృష్టించిన ఆయన చిన్న కుమార్తె శ్రీజ ఈ రోజు పాపకు జన్మనిచ్చారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో ఉన్న ఆమెను చిరంజీవి సతీమణి సురేఖ,కుమారుడు రామ్ చరణ్ తేజ,అల్లు అరవింద్ వెళ్ళి పరామర్శించారు. ఆసుపత్రిలో వారు చాలా సేపు ఉన్నట్లు తెలిసింది.
 
•  టిడిపికి బై చిరుకి జై ? 
చాలా మంది   ప్రధాన పార్టీల ముఖ్య నేతలు చిరు రైలెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో కాంగ్రెస్, టిడిపికి చెందిన నేతలు ఉండడం విశేషం. రాయలసీమలో బలమైన నాయకుడిగా పేరున్న భూమా నాగిరెడ్డి..సతీసమేతంగా జై చిరంజీవ అనటానికి రెడీ అయ్యారు. దీనికోసం కర్నూలు జిల్లా నంద్యాల , ఆళ్లగడ్డలో జరిగిన టిడిపి కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు. 14 ఏళ్లపాటు తెలుగుదేశంలో ఉన్నా..సరైన గుర్తింపు రాలేదని ఈ సందర్భంగా  భూమా సన్నిహితులతో ఆవేదన వ్యక్తం ...
 
•  టిడిపికి భూమా దంపుతులు బై... 
కర్నూలు: మొత్తానికి అందరూ ఊహిస్తున్నట్లుగానే ఈ రోజు టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు భూమా దంపతులు ప్రకటించారు. టీడీపీతో తమకు 25 యేళ్ళ అనుభంధం ఉందని అందుకే ఈ నిర్ణయాన్ని ఎంతో బాధ పడుతూ తీసుకున్నామని వారు అన్నారు. తమ అనునాయులు, పలువురు పార్టీ కార్యకర్తలతో సమావేశం యోర్పాటు చేసిన భామా దంపతులు ఈ నిర్ణయాన్ని ప్రకటించి రాజీనామా పత్రాలు రాశారు.
 
•  కేంద్ర ప్రభుత్వానికి ఎస్ పిమద్దతు వెలుపలి నుంచే 
న్యూఢిల్లీ : ముందుగా ఊహించినట్టే సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్నిసమాజ్‌వాది పార్టీ గట్టెక్కించడానికి పచ్చజెండా ఊపింది. వారం రోజుల కాలంలోనే ఎన్నో తతంగాలు జరిగాయి. ఈ పరిణామాల అనంతరం ప్రభుత్వానికి తాము బయట నుంచి మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్  శుక్రవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ ప్రకటనతో వామపక్షాలు, యుపిఏకు మధ్య ఉన్న నాలుగేళ్ళ బంధం తెగిపోయింది. ఎన్నో యేళ్ళుగా రెండు పార్టీల నడుమ ఉన్న ...
 
•  జేసీ అనుచరుడి పై దాడి...పరిస్దితి విషమం 
కర్నూలు: అనంతపురం జిల్లా తాడి పత్రి మార్కెట్ యార్డులో కాంగ్రెస్ టీడెపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మంత్రి జెసీ దివాకరరెడ్డి ప్రధాన అనుచరుడు వీరాపురం వంశీ మోహన్  రెడ్డి పై టీడీపీ వర్గీయులు వేట కొడవళ్ళతో దాడి చేసారు. తాడిపత్రి మార్కెట్ యార్డులో ఓ ప్రెవేట్ పంచాయితీలో ఈ వివాదం రేగింది. అనంతరం అది ముదిరి దాడికి దారితీసింది. ఈ దాడిలో వంశీ మోహన్ రెడ్డి తీవ్రంగా ...
 
•  వేల సంఖ్యలో నకలీ సర్టిఫికేట్లు పట్టివేత 
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ నకిలీ యూనివర్శిటీ గుట్టు రట్టు చేసారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో  గోల్కొండ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ పేరుతో నడుస్తున్న ఓ నకిలీ యూనివర్శిటీపై ఈ రోజు ఉదయం వారు దాడి చేసి పట్టుకున్నారు.  ఈ స్కామ్ సూత్రధారి  అయిన అఫ్సరుద్దీన్ ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు దాదాపు 25 వేల నకిలీ సర్టిఫికేట్లును , ఎలక్ట్రీనిక్ సామగ్రిని,నగదును స్వాధీనం చేసుకున్నారు. మలక్ ...
 
•  బీసీ ల సంక్షమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది 
హైదరాబాద్: బీసీ ల అభివృధ్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని,తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అహర్నిశలు దాని అభ్యున్నతి గురించి ఆలోచిస్తున్నారని సీ.ఎం వై యస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. బీసీలకు ఫీజు రాయితీలు, కొత్తగా కొన్ని కులాలని బీసీల్లో చేర్చటం వంటివి వారి కృషి ఫలితమేనని ఆయన అన్నారు. కొత్తగా 10 కులాలను బీసీల్లో చేర్చినందుకు గాను ఆయనను బీసీ సంఘాల నేతలు ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి అభినందించారు. పదవ తరగతిలో ...
 
•  ఆర్టీసీకి సమ్మె నోటీసు 
హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది.కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు  చేసి ఆ కార్మికులను పర్మెనెంట్ చేయాలని కోరుతూ ఎన్ ఎం యు నేతలు ఈ రోజు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందచేసారు. తమ సమస్యలకు సానుకూలంగా స్పందించకుంటే 19 వతేదీ తరువాత సమ్మెకు దిగుతామని వారు నోటీసులో హెచ్చరించారు.
 
•  ట్రక్ ఆపరేటర్లు సమ్మె విరమణ 
గత నాలుగు రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టిన లారీ సంఘాలు ఎట్టకేలకు తమ పట్టును వీడాయి. కేంద్ర ప్రభుత్వంతో అర్ధరాత్రి జరిగిన చర్చల్లో సర్వీస్ టాక్స్ తొలగించడానికి అంగీకారం కుదరడంతో ట్రక్కు యజమాన సంఘాలు ఆందోళన విరమించాయి. పూర్తిగా హామీలు నెరవేరకపోయినా.. ముఖ్యమైన వాటి అమలుకి అంగీకారం కుదరడంతో ట్రక్ ఆపరేటర్లు సమ్మె నిలిపేసేందుకు ఒప్పుకున్నారు. రాష్ట్రంలో కూడా ...
 
•  ఓటు బ్యాంకు కై ఉద్యమిస్తున్న 'చిరు' నాయకులు 
రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని రోజులు, వివిధ వర్గాల మద్దతు కోసం మరికొన్ని రోజులు సమావేశాలు నిర్వహించిన చిరంజీవి పార్టీ నాయకులు ఇప్పుడు ఓటర్ల నమోదు కోసం ఉద్యమిస్తున్నారు. అతి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న తమ నాయుకుడు చిరంజీవిని గెలిపించటానికి ఓటు బ్యాంకు అవసరమని దానిపై దృష్టి పెట్టారు. వారంతా తమ కొత్త పార్టీకి తనదైన ఓటు బ్యాంకు తయారు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ...
 
•  చాలా...చెత్తగా.. 
ఈ  వారం నితిన్ ఎయిట్ పాక్ తో తొలిసారి దర్శనమిచ్చిన 'విక్టరీ' రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే వెంకట్ హీరోగా నటించిన 'కొంచెం కొత్తగా' సినిమా విడుదలై చాలా చెత్తగా అనే పేరు మిగుల్చుకుంది. విక్టరీ ఓపినింగ్స్ అయినా సంపాదించుకుంది కానీ...కొంచెం కొత్తగా సినిమాకు ఆ అదృష్టమూ దక్కలేదు. కథ,కథన లోపాలే ఆ సినిమాలకు మైనస్ గా మారాయని అంటున్నారు.
 
•  'కంత్రి' సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు తొలిగింపు 
హైదరాబాద్ జూనియర్ ఎన్టీఆర్,హన్సిక జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన 'కంత్రి' చిత్రం ప్రస్తుతం వివాదంలో ఉంది. అందులో దళితులను అవమానించేలా ఉన్న దృశ్యాలను వెంటనే తొలిగించాలని,బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్ఫీ ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన డిమాండుపై ఆ చిత్ర దర్శకుడు స్పందిచారు. వారు అభ్యంతరకరంగా భావించిన దృశ్యాలను వెంటనే తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. తాము కావాలని ఎవరినీ కించపరిచలని భావించి దీన్ని చిత్రీకరించలేదని ఆయన తన ...
 
•  విశాఖ విమానాశ్రయానికి మహర్దశ 
విశాఖ విమానాశ్రయానికి త్వరలోనే మహర్దశ పట్టబోతోందని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు.  డిసెంబర్‌ నాటికి నూతన టెర్మినల్‌ భవనం పూర్తయిన వెంటనే విమానాశ్రయాన్ని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో విమానాశ్రయాన్ని ఇప్పటి వరకు వినియోగించలేక పోయామని, ఇకపై ఆలాంటి ఇబ్బందులు ఉండవన్నారు... అలాగే రైళ్ల విషయంలో వాల్తేర్ రైల్వే డివిజన్‌కి పూర్తి న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
•  రధ యాత్రలో తొక్కిసలాట...ఆరుగురు మృతి 
పూరి జగన్నాధ రధ యాత్రలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. వైభవంగా మొదలైన రధ యాత్రలో విషాదం ఒలికింది. భగవంతుని దగ్గరగా చూసేందుకు భక్తులు ఒక్కసారిగా తోసుకుని రావటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు చనిపోయినట్లు సమాచారం.
 
•  ఖమ్మం జిల్లాలో నక్సల్ నేత హత్య 
ఖమ్మం: జిల్లాలోని  కొత్తగూడెం మండలం అడవుల్లో ఒక నక్సలైట్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  ఈ మండలంలోని  బంగారు చిలుక అడవుల్లొ ప్రజా ప్రతిఘటన  గోదావరి లోయ  జిల్లా కార్యదర్శి భద్రన్న అలియాస్ అశోక్ ను దారుణంగా గొంతు కోసి చంపారు.  ఇది కోవర్టు ఆపరేషన్ కాదని, నక్సల్ గ్రూపుల మధ్య గొడవలే దీనికి కారణమని  జిల్లా ఎస్పీ చౌహాన్ చెబుతున్నారు. ప్రజాప్రతిఘటన దళ సభ్యుడు కిరణ్ , అతనితో పాటు ...
 
•  కంత్రీ సినిమాపై మందకృష్ణ గుర్రు 
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రీ సినిమాపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ గుర్రుమన్నారు. ఈ సినిమాలోని సన్నివేశాలు కొన్ని దళితులను అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు. కంత్రీ సినిమా హీరో ఎన్టీఆర్, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అశ్వనీదత్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సన్నివేశాలను అనుమతించిన సెన్సార్ బోర్డు కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన ...
 
•  రామోజీకి ఐటి ప్రశ్నలు 
హైదరాబాద్: అక్రమ పెట్టుబడుల కేసులో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఇన్ కంటాక్స్ అధికారులు ప్రశ్నించారు. మార్గదర్శి పైనాన్సియర్స్ లో అక్రమ పెట్టుబడులపై వివరణ ఇవ్వడానికి ఆదాయపు పన్ను అధికారులు రామోజీరావును ప్రశ్నించారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు హాజరైన రామోజీరావును సుమారు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. డిపాజిట్ల రూపంలో మార్గదర్శి  అక్రమంగా పెట్టుబడులు సేకరించిదన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది.
 
•  'అటునుంచి నరుక్కురా!' 
మనం యేదైనా ఒకటి అనుకుని వర్కవుట్ చేస్తే పనవ్వకపోతే సర్లే...'అటునుంచి నరుక్కురా' అని చెబుతూంటాం. ఇప్పుడు అదే టైటిల్ తో ఒక సినిమా రానుంది. 'ఆ నలుగురు' తో రచయితగా ఎంట్రీ ఇచ్చి 'పెళ్ళైన కొత్తలో' సినిమాతో దర్శకుడుగా ప్రమోషన్ సంపాదించిన మదన్ ఈ సినిమా చేస్తున్నాడు. హీరో ఎవరో కాదు అజయ్. విలన్ గా చాలా సినిమాల్లో చేసిన ఈ కుర్రాడు ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు.
 
•  దటీజ్ రజనీ... 
ఇంటర్ నెట్, ఎ.ఫ్.రేడియో ల వినియోగం బాగా పెరిగాక సినిమా ఆడియో సీ.డీ లని అమ్మటం అంత తేలికైన పనికాదు. అందుకే చాలా మంది ఆడియో మీద వచ్చే ఆదాయాన్ని అసలు లెక్క వేయటం లేదు. అయితే దీన్ని బ్రేక్ చేసిన చిత్రం కుశేలన్. ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయుకుడుగా నిజ జీవిత పాత్రలో వస్తున్న ఈ సినిమా ఆడియో ఇప్పుడు మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. సునామీ తరహా ...
 
•  కోటిన్నర తార...నయనతార 
రన్, పందెంకోడి వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన లింగుస్వామి ఇప్పుడో కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. దాని నిమిత్తం నయనతారను సంప్రదించాడుట. ఆమె ఇప్పుడు తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో హాట్ స్టార్ కావటంతో ఉలకలేదట. కానీ  ఆయనపట్టువదలక ఎంత రెమ్యునేషన్ అయినా రెడీ అని కబురు పంపాడుట. దానికామె వెంటనే నేనూ అలా అయితే ఎలాంటి క్యారెక్టర్ కైనా రెడీ అని సమాధానం ఇచ్చిందిట.  రికార్డు స్ధాయిలో ఒకటిన్నర కోటి ...
 
•  మిస్టరీ వీడిన సజీవ దహనం కేసు 
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ రైల్వే ట్రాక్ వద్ద జరిగిన నలుగురు వ్యక్తుల హత్య కేసు మిస్టరీ వీడింది. మేడ్చెల్ రైల్వై ట్రాక్ వద్ద ఇటీవల నాలుగు సగం కాలిన మృతదేహాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫతే మహ్మద్, జులేకా, సయ్యద్ హుస్సేన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
•  కాంగ్రెస్ చర్య అనైతికం: నారాయణ 
శ్రీకాకుళం: కేంద్రంలో యుపిఎ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ సమాజ్ వాదీ మద్దతు కోరడం అనైతికమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ నెంబర్ గేమ్ ఆడుతోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలను స్వాగతిస్తామని ఆయన చెప్పారు.
 
•  హైదరాబాదీ ప్రేమలో అమృత 
హైదరాబాద్: బాలీవుడ్ నటి అమృత అరోరా హైదరాబాదుకు చెందిన ఒక వ్యాపారి ప్రేమలో పడినట్లు సమాచారం. అమృతా అరోరా ఇటీవలే ఇంగ్లాండు క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్ తో తెగదెంపులు చేసుకుంది. హైదరాబాదు వ్యాపారి ప్రేమలో పడడం వల్లనే ఆమె ఉస్మాన్ అఫ్జల్ తో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదేమీ ఆమె కెరీర్ కు సంబంధించిన వ్యవహారం కాదు.
 
•  ఆ హీరోకి....అరడజను హీరోయిన్లు... విలన్లు 
'మాస్' సినిమాతో డైరక్టర్ అయిన కొరియోగ్రాఫర్ లారెన్స్ . అతను మొన్న 'పార్ధు' సినిమాతో జనాన్ని పరారు అయ్యేలా బెదిరించాడు. తాజాగా అతను ఓ తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. శక్తి చిదంబరం అనే మాస్ మసాలా డైరక్టర్ కి లారెన్స్ తో చెయ్యాలని ఎప్పటినుంచో కోరికట. దాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఇక ఆ సినిమాలో తన అభిమాన హీరోకి అరడజను మంది హీరోయిన్లు, మరో అరడజన్ మంది విలన్స్ ని ...
 
•  జగన్ చానల్ లో రామోజీపై సీరియల్? 
మార్గదర్శి ఫైనాన్సియర్స్ విషయంలో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు వెన్నులో వణుకు పుట్టించిన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి రామోజీని భయపెట్టనున్నారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరుతో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకెకెక్కిన ఆయన అంతటితో ఊరుకోలేదు. రామోజీ జీవితం ప్రధానంగా ఒక టీవీ సీరియల్‌ను నిర్మించారు.
 
•  మరో రెండు శవాలు లభ్యం 
విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో గల్లంతైన పోలీసుల్లో గురువారంనాడు మరో ఇద్దరి శవాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం పది గంటల నుంచి గాలింపు చర్యలు ముమ్మరయ్యాయి. రాత్రి వర్షం పడడంతో గాలింపు చర్యలు ముందుకు సాగలేదు. గురువారం పది గంటల ప్రాంతంలో వర్షం తెరిపినిచ్చింది. దీంతో గాలింపు చర్యలు సాగుతున్నాయి.
 
•  అవినీతిని దరి చేరనీయొద్దు: వైయస్ 
హైదరాబాద్: అవినీతిని దరి చేరనీయవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లాలవారీగా ఆయన గురువారంనాడు సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతిని దరి చేరనీయవద్దని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆయన కలెక్టర్లకు సూచించారు.
 
•  హాట్ హాట్ గా హన్సిక... 
దేశముదురు,కంత్రీ సినిమాలతో తెలుగువారిని తన వైపు తిప్పుకున్న హన్సిక ఇప్పుడు ఓ హిందీ సినిమాలో బెల్లీ డాన్స్ చేస్తోంది. అయితే ఈ పాటలో ఆమె చాలా హాట్ గా కనిపిస్తుందిట. ఈ పాటను బాలివుడ్ కొరయోగ్రాఫర్ గణేష్ ఆచార్య  అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడయితే యూనిట్ చాలా ఉషారుగా ఉన్నారుట. ఎందుకంటే ఆ పాటలో ఆమె చాలా తక్కువగా శరీరాన్ని కప్పే గౌన్ ధరిస్తుందిట. ఇంతకీ ఇంతలా ఊరిస్తున్న ...
 
•  చిరు సేన కోసం ఎస్సెమ్మెస్ లు 
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రచారానికి సెల్ ను కూడా వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ సేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారా, వెంటనే చేరిపొండి అంటూ సెల్ ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్నారు. ఈ ఎస్సెమ్మెస్ లకు జవాబు పంపితే చాలు చిరు సేనలో చేరిపోయినట్లే. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరిగినా సరే, సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి అనుచరులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చిరంజీవి అభిమానులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ...
 
•  'గాడ్స్ మస్ట్ బీ క్రేజీ' తెలుగులో? 
'గాడ్స్ మస్ట్ బీ క్రేజీ' అనే ఆఫ్రికన్ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అదొక వెరైటీ కామెడీ. దాన్నిప్పుడు తమిళంలో కమిడియన్ సింధిల్ చేయబోతున్నాడు. మన బాబు మోహన్ కి దగ్గర పోలికలుండే ఈ నటుడు మనకూ తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమే. ఈ మధ్య వడివేలు హవా పెరగటంతో అతనికి,అతని మోటు హాస్యానికి చోటు లేకుండా పోయింది. దాంతో వడివేలులాగానే తానూ కామిడీ హీరోగా ట్రై చేయాలని డిసైడ్ ...
 
•  సెన్సార్ ని భయపెడుతున్న నమిత... 
నమిత భారీ అందాలు ఎంజాయ్ చెయ్యని వారెవరుంటారని ఆమె అభిమానులు ఛాలెంజ్ లు చేస్తున్నా అవి కొంత మందికి పీడకలగా పరణమించటం జర్గుతోంది. అది మరెవకో కాదు. సెన్సార్ వారికిట. ఆమె నటించిన సినిమాలు రిలీజైనప్పుడల్లా పైనుండి భారీ ఎత్తున ప్రెజర్స్ రావటంతో చాలా సీన్లు కట్ చేయకుండానే వదిలేస్తున్నారట. అందుకనే మనకా అందాల విందు లభిస్తోందన్నమాట. మరి అందరికీ ఆమోదయోగ్యమై సెన్సార్ సీను కి అడ్డేమిటి అంటే ...ప్రేక్షకులేట.
 
•  వామపక్షాల నేతలతో బాబు భేటీ 
న్యూఢిల్లీ: యుఎన్ పిఎ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. అణు ఒప్పందంపై వామపక్షాలు యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే నేపథ్యంలో యుఎన్ పిఎ భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఇవ్వవచ్చుననే వార్తల నేపథ్యంలో చంద్రబాబు వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు.
 
•  బాలయ్యతో మహదేవన్ సినిమా లేనట్టేనా? 
ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో నలుగుతున్న హాట్ టాపిక్ ఇదే. రాజమౌళి శిష్యుడు మహదేవన్ ఒక్క సినిమా కూడా చెయ్యకుండానే పరిశ్రమ వర్గాల నోళ్ళల్లో నానుతున్నాడు. కారణం పిల్లి పిల్లల్ని పెట్టి యేడిళ్ళు తిప్పినట్లు ఒకే సబ్జెక్టును అందరి హీరోలుకు వినిపిస్తున్నాడని సమాచారం. అతను తయారు చేసిన 'క్షత్రియుడు' స్క్రిప్టు మొదట ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకుని చేసానని దిల్ రాజు ద్వారా అతన్ని కలిసాడు. కాని వర్కవుట్ కాలేదు. ...
 
•  కామిడీగా రాజశేఖర్ .... 
అవును...రాజశేఖర్ ఇప్పుడో కామిడీ సినిమాకు సైన్ చేసాడు. అందరూ కామిడీతో ముందుకెళుతూంటే తను మాత్రం అవుట్ డేట్ అయి పోయిన యాక్షన్ సినిమాలనే ఎందుకు నమ్ముకోవాలి అనుకున్నాడో యేమో ఆయనా ఈ బాట పట్టాడు. కాకపోతే తన మార్కు అయిన రీమేక్ నే నమ్ముకున్నాడు. మళయాళంలో మోహన్ లాల్ నటించిన 'హలో' సినిమాను తెలుగుకి రీమేక్ చేయటానికి ఒప్పుకున్నాడు. 'చిరునవ్వుతో' దర్శకుడు రామ్ ప్రసాద్ డైరక్ట్ చేయనున్న ఈ సినిమా ఆద్యంతం ...
 
•  చిరంజీవి పార్టీ నుంచి బ్రహ్మానందం పోటీ? 
హైదరాబాద్: చిరంజీవి కొత్తగా పెట్టబోయే పార్టీలో హాస్యనటుడు బ్రహ్మానందం చేరనున్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశముంది. గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మానందం చాలాకాలం పాటు అత్తిలిలో లెక్చరర్ గా పనిచేశారు. చిరంజీవి పార్టీ పెడితే మద్దతు ఇస్తానని బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటించారు. బ్రహ్మానందం చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. బిజెపి మాజీ ఎమ్మెల్యే  లక్ష్మణ్ కూడా చిరంజీవి పార్టీలో చేరే అవకాశముంది.
 
•  చిరంజీవి ముఖ్యమంత్రి కాలేరు: సుబ్బారెడ్డి 
హైదరాబాద్: చిరంజీవి ముఖ్యమంత్రి కాలేరని, ఆయన పార్టీ కొన్ని ఓట్లు మాత్రం చీల్చగలుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.వి. సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పార్టీ వల్ల టీడీపీకి తాత్కాలికంగా నష్టం జరిగినట్లు అనిపించినా చివరకు కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున చిరంజీవి పార్టీ పెట్టినా ఎవరూ వెళ్ళరని, ఎన్నికల ముందు మాత్రం పెద్ద ఎత్తున నాయకులు వెళ్ళిపోతారని, ...
 
•  అల్లు అరవిందా మజాకా!! 
మూరుగదాస్ దర్శకత్వంలో తమిళంలో నిర్మితమైన 'గజిని' చిత్రం తెలుగులోనూ డబ్బింగై రికార్డు స్థాయిలో కలెక్షన్లు సంపాదించి పెట్టింది. ఇక దాన్ని అమీర్ ఖాన్,అసిన్ హీరోయిన్లుగ గీతా ఆర్ట్స్ పతాకఓపై అల్లు అరవింద్ తన మిత్రుడు బి. మధుతో కలిసి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసే అల్లు అరవింద్ "గజిని" ఈ సినిమా రిలీజ్ కాకమూందే వ్యాపార విషయంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమలో రికార్డ్ సృష్టించారని తెలుస్తోంది. ...
 
•  'వరుడు' వద్దంటున్న మహేష్? 
త్రివిక్రమ్,మహేష్ కాంబినేషన్ లో 'వరుడు' వచ్చే అవకాశాలు లేవని పరిశ్రమలో వార్తలు వినపడుతున్నాయి. అలాగని ప్రాజెక్టు ఆగుతుందని కాదట. త్రివిక్రమ్ చెప్పిన కథ,కథనాలు తన ఇమేజ్ కి నప్పేలా లేవని మహేష్ భావిస్తున్నాడుట. అందుకే ఆ కథని మార్చమంటే త్రివిక్రమ్ వండిన దాన్ని ప్రక్కన పెట్టి మరోదాన్ని రెడీ చేస్తున్నాడుట. అది అప్పట్లో యమ్.యస్.రాజు బ్యానర్ లో మహేష్ చెయ్యటానికి చెప్పిన కథ 'హరే రామ హరే కృష్ణ' కావచ్చంటున్నారు. మరి ...
 
•  అక్కడైనా...ఇక్కడైనా త్రిషే 
ప్రస్తుతం త్రిష సీజన్ నడుస్తోంది. పూరీ దర్శకత్వంలో ప్రభాస్ తో చేసిన సినిమా 'బుజ్జిగాడు' వర్కవుట్ కాకపోయినా ఆమె ఆఫర్లుకు లోటు లేదు. అందులో మోకాళ్లు కనిపించే స్కర్ట్స్ వేసుకుని గ్లామర్ గర్ల్ పాత్రని చేసి ప్రశంసల కంటే విమర్శల్నే ఎక్కువ పొందింది. ఇక డైలాగులు అయితే ప్రేక్షకుల్ని చికాకు పరిచాయిని రోజురోజుకి నీరసిస్తున్న కలెక్షన్స్ చెపుతున్నాయి. అయితే ఇప్పుడామె రెండు భారీ సినిమాల్లో ...
 
•  సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం... 
టైటిల్ వెరైటీగా ఉంది కదా...దీన్ని అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న ఓ కొత్త చిత్రానికి అనుకుంటున్నారు. జి.ఈశ్వర్ అనే నూతన దర్శకుడు ఈ  కామిడీ ఫిల్మ్ ద్వారా పరిచయమవుతున్నారు. విజయ్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. దశరా కి రిలీజుకి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిలేరియస్ కామెడీ గా రాబోతోంది. మంచి మెసేజ్ కూడా ఉంటుందంటున్నారు. చూద్దాం...
 
•  డైరక్టర్ గా మారుతున్న మాజీ హీరో... 
హీరో పాత్ర నుండి రజనీ 'శివాజీ' తో విలన్ గా మారి కెరీర్ ని తెలివిగా మలుచుకొస్తన్న  సుమన్ త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నాడు.  ఓ యాక్షన్ దర్శకత్వం చేస్తానంటున్న ఆయనికి TFPC సెక్రటరీ కాట్రగడ్డ ప్రసాద్ నిర్మాతగా అండగా ఉండబోతున్నాడు. ఓ కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్న సుమన్ ఈ సినిమాలోనూ ఓ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.  ఇక సుమన్ ,కాట్రగడ్డ ప్రసాద్ కాంబినేషన్ ఇప్పటిది కాదు. వారి ...
 
•  సినిమా మొత్తం వర్షమేట... 
గతంలో ఒక కన్నడ సినిమా మొత్తం వానలో చిత్రీకరించారంటే గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి ఎక్సపరమెంట్ జరుగుతోందిట. 'జాబిలమ్మ' పేరుతో తయారవుతున్న ఈ సినిమా వర్షం బ్యాక్ డ్రాప్ లో చెయ్యటమే కాక 25 రోజుల్లో సింగిల్ షెడ్యూలులో పూర్తి చేసారుట. నవనీత్ కౌర్, రాజీవ్ కనకాల జంటగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి ఎదురుచూస్తోంది. సినిమా కనుక వర్కవుట్ అయితే మరెన్నో ఇలాంటి ...
 
•  ఎన్టీఆర్..వినాయక్ సినిమాకు మళ్ళీ బ్రేక్? 
ఎన్టీఆర్ ...'కంత్రి' పరాజయానికి కారణాలు విశ్లేషించుకుని ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదనే పట్టుదలతో వున్నాడు. 'యమదొంగ'తో మళ్లీ గాడిలో పడిందనుకున్న కెరీర్ మళ్లీ ఇరుకున పడినట్లు భావించాడు .దాంతో కథ విషయంలో పట్టుదలగా ఉన్నాడు. దానికి నిదర్శనం 'ఆది' వంటి బ్లాక్ బస్టర్ తో తన కెరీర్ కి పునాదులు వేసిన వి.వి.వినాయక్ నే మరో సారి సరిగా కథ తయారు చేయమని అన్నట్లు తెలుస్తోంది. నిజానికి  ఏప్రిల్‌లోనే ఎన్టీఆర్, వినాయక్ ...
 
•  లక్ష్మీపార్వతి పై బాలకృష్ణ నిప్పులు 
 హైదరాబాద్: నందమూరి లక్ష్మీపార్వతి పై ఎన్.టి.ఆర్ కుటుంబం తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.తమ తల్లి బసవతారకం మెమోరియల్      ట్రస్టు విషయంలో  లక్షీపార్వతి  కోర్టు కెక్కడాన్ని  ఎన్.టి.ఆర్ కుమారులు సీరియస్ గా తీసుకున్నారు.కేవలం తమ తండ్రి కి, రాష్రంలో ,ప్రపంచంలో ఉన్న హోదాను అనుభవించేందుకే లక్షీపార్వతి ఎన్.టి.ఆర్ కు దగ్గరయ్యారని హీరో బాలకృష్ణ హైకోర్టులో కౌంటర్ దాకలు చేసారు. లక్షీపార్వతిని  తమ తండ్రి ఎన్.టి.ఆర్ చట్ట ప్రకారం పెళ్ళి చేసుకున్నారనడాన్ని నందమూరి బాలకృష్ణ ...
 
•  ఇది రాజకీయ పార్టీల సిన్మాల సీజన్? 
ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి  తన నిజ జీవిత పాత్రతో ఓ చిత్రం రూపొందనున్నదని ఆ మథ్య వచ్చిన వార్తలు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. సి.సి.రెడ్డి  నిర్మాతగా ఈ చిత్రాన్ని తమ విసు ఫిల్మ్ బ్యానర్ పై తీసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో వచ్చే తన పాత్రని మూడు ధపాలలో పూర్తి చేయమని సీ.ఎం కోరినట్లు తెలుస్తోంది. 'తమ్ముడు' ఫేమ్ అరుణప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సబ్జెక్టు ముఖ్యంగా బ్రహ్మానందం ...
 
•  చిరంజీవి పార్టీకి రంగం సిద్ధం: డాక్టర్ మిత్రా 
హైదరాబాద్: చిరంజీవి పార్టీకి అంతా రంగం సిద్ధమైందని చిరంజీవి రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. పార్టీ గురించి చిరంజీవి త్వరలో స్వయం ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ఈనెల్ 7 నుంచి 14 వ తేదీ వరకు చిరంజీవి అభిమానులు ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని డాక్టర్ మిత్రా సూచించారు. చిరంజీవి తరఫున నాగబాబు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరంజీవి జనంలొ తిరగడానికి వీలుగా బుల్లెట్ ప్రూఫ్ ...
 
•  గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా అరెస్టు 
గుంటూరు: వందకు మూడు వందలు ఇస్తామంటూ దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 45 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఒక ఇంటి నుంచి నకిలీ నోట్లు  చలామణి అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్ళి నలుగురిని పట్టుకున్నారు. వీరిలో ఒకరు గతంలో దొంగనోట్ల చలామణి కేసులో నిందితుడు.
 




 Back to Top of Page 





Credit Cards Offers Compare and Apply!
Find Lowest Price Compare and Save!
Shopping
  
Daily Cartoon from CartoonStock.com
Daily funny cartoon from CartoonStock
© original artist c/o CartoonStock.com - unauthorised reproduction is illegal
Like this cartoon ?
License this cartoon for print use, web use or presentation use.
Buy this cartoon on a mug, mousemat or t-shirt.
Buy this cartoon as a print or original artwork.


 Back to Top of Page 



   
  
 
Resources
 Indian Festivals
 INDUSmall
 TajOnline

Popular Televisions
Lowest Prices
Samsung LN52A650 52" LCD TV$1999.99
Samsung LN-46A650 46" LCD TV$1635.00
Panasonic TH-50PZ800U 50" Plasma TV$2139.00
Sharp AQUOS LC52D64U 52" LCD TV$1419.00
Samsung LN52A550 52" LCD TV$1709.99

Popular Digital Cameras
Lowest Prices
Canon EOS 40D SLR Digital Camera Body Only$849.00
Canon EOS Rebel XSi Black Digital Camera Kit$770.00
Nikon D60 SLR Digital Camera Kit$593.01
Nikon D300 Black SLR Digital Camera Body Only$1519.99